Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ప్రేరణ
సా. నరుడా- ఓ పామరుడా
జీవిత సత్యాలను తెలిసుకో
యేసు బాట ఎన్నుకో
నిత్య జీవితం చేరుకో ||ప||
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ ఆ.....ఆ...
నరుడా - నామాట నమ్మరా
ఈ నిత్య సత్యాల సారాంశం యేసు నాథుడే
బోధించెనురా నరుడా - ఓ పామరుడా ||న||
యేసయ్యా - యేసయ్యా
యేసయ్యా - యేసయ్యా
1. కోటికోట్లకు వారసుడైనా ఊపిరున్నంత
వరకేరా నరుడా.. ఓ పామరుడా ఊపిరి
పోయిన నిన్ను మోసికొని ఊరి బయట
పాతేసివచ్చెదము నరుడా - ఓ పామరుడా
వందమంది నీ వెనుక ఉన్న ఒక్క గడియ
నీ శ్వాస నిలుపుట తరమా
నీతరము నీ పరలోక ప్రయాణం ||2||
ఆపలేరురా జీవుడా
నరుడా ఓ నరుడా
ఈ మాట నిజమురా నమ్మరా ||2||
2. రాజువైన మహారాజువైన నిరుపేద
ప్రజలపై ప్రేమ చూపరా
నరుడా - ఓ పామరుడా
కుంటివారిని గ్రుడ్డివారిని చేరదీసి నువ్వు
ఆదరించరో నరుడా - ఓ పామరుడా
కాలమెంత విలువైనదన్ని
కరుణామయుడు వచ్చే సమయం
నరుడా - ఓ పామరుడా
నీ పరలోక నరుడా - ఓ పామరుడా
నరుడా ఓ నరుడా
ఈ మాట నిజమురా నమ్మరా ||2||