Type Here to Get Search Results !

నాతో మాట్లాడుమయ్యా నన్ను ( natho matladumaya nannu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నాతో మాట్లాడుమయ్యా నన్నుదర్శించుమయ్యా

నీ మందిరాన నీ సన్నిధాన

నీ యాత్మతో నన్ను నింపుమయా

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా


1 వ చరణం.. 

కన్నీళ్ళెనా కష్టాలెదురైనా

కడవరకు నను చేర్చుమయా

కరువుతోడైనా కలిమివేరైనా

కరుణించి కాపాడుమయా

నా వేదనలో నీ జాలితో నా శోధనలోనీ చేతితో

నిత్యం నను నడిపించుమయ్యా


2 వ చరణం.. 

నా వారే నన్నునిందించువేల

నను విడిచి పోబోకుమయ్యా

ఆదరణ నాకు కరువైన వేళ 

దరి చేరి ఓదార్చుమయ్యా

నా నిందలలో నా తోడువై

అపనిందలలో నా చేరువై

నిత్యం నను నడిపించుమయా

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా 


3 వ చరణం.. 

నా కాలుజారి తొట్రిల్లు వేళ

చే జాచి నిలబెట్టుమయ్యా

సాతాను నన్నుబంధించువేళ

నను చేరి విడిపించుమయ్యా

నీ చేతితో నను పట్టుకో నీ సేవలోనను వాడుకో

నిత్యం నను నడిపించుమయా

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section