Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నవ జంటకు మా ఆహ్వానం -
నవ సృష్టికి ఇది శ్రీకారం
వధూవరులకు మా ఆశీస్సులు -
అందుకొనుమా మా ఆనందంతో
1. దేవుని సృష్టికి వింతలు -
మానవ సృష్టికే వన్నెలు
ఆదిలో వెలసిన ఆదామవ్వలు -
నేటికీ నిలిచిరి ఆదర్శంగా
2. వధూవరులా అనుబంధం -
మానవ కుటుంబ ప్రారంభం
నేటికీ నిలిచే దాంపత్యం -
సాగాలి ఈ దేవుని యిష్టమై
3. ముడివేసిన ఈ అనుబంధం -
తాళికట్టిన శుభవేళతో
పవిత్ర బంధమై నిలుచునే -
పరమ పధం చేరుదాకా