Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 4
నవ నక్షత్రధారి - దేవుని సహాకారి
ఆత్మ సిరుల సంఝరి - మోక్షధారి మా మేరి
శరణంటిమి మా ప్రియజనని - చిలికించు నీదు ప్రేమన్
నీ ప్రేమలోని హాయి - ఎంతెంతో మధురము
అమ్మా అమ్మాఅని పిలిచేమమ్మా
అమ్మా అమ్మా మాకై ప్రార్ధించమ్మా
1 వ చరణం..
నవ నక్షత్రధారివి నీవే
నవ నిర్మాత మాతవు నీవే
మము చేరదీసి మనసారా చూసి
ప్రేమించినావు నీవే (అమ్మా)
2 వ చరణం..
దివి భువి నేలు రాణివి నీవే
మా మోక్షపు వాకిలి నీవే
మా రక్షణివై మార్గదర్శినివై
నడిపించు నీ సుతుని త్రోవన్ (అమ్మా)