Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఆఆఆ... ఆఆఆఆ.... దానిద పదస - సగ రినిస
పల్లవి:
నవ్యకాంతి విరిసింది - ఈ శుభసమయంలో
దివ్యశాంతి కురిసింది - శ్రీ సభ హృదయంలో ||2||
అంజలి గీతం పాడుదము - పరలోకదేవునికి
ఉత్సవగీతం పాడుదము - త్రియేక దేవునికి
కోరస్ :స్వాగతం - సుస్వాగతం
శ్రీ యేసు యాగానికి స్వాగతం -
ఘనస్వాగతం - ప్రభు మందిరానికిllనవ్యll
1 వ చరణం..
కలువరిబలికి సాదృశ్యము - జగతికి రక్షణ ఈ త్యాగము ||2||
పరిశుద్ధమైన హృదయంతో - ప్రేమతో వేగమే రారండి
ఆరాధన - ఆరాధన మా పూజ్యదేవునికి
ఆరాధన - ఆరాధన మా యేసుక్రీస్తునకు
2 వ చరణం..
పరిమళ సుమములు - ప్రభవించే ...
ప్రమిదల కాంతులు - ప్రసరించే ||2||
వికసితమైన మనసులతో - యేసుని చెంతకు రారండి ||2||