Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1. నే జేసుని వెలుగులో నడచెదను -
రాత్రింబవళ్ళాయనతో నడచెదను
వెల్లు నడచెదను వెంబడించెదను -
జేసువే నా రక్షకుడు
నడచెద నే ప్రభు జేసునితో -
నడచెద నే ప్రభు హస్తముతో
కాంతిలో నుండగా జయ కాంతులు -
జేసునే నే వెంబడింతును
2. నే జేసుని వెలుగులో నడచెదను -
గాఢంబగు చీకటిలో భయపడను
సర్వమిచ్చెదను చెంతనుండెదను -
జేసువే నా రక్షకుడు
నడచెదనే ప్రభు జేసునితో
నడచెదనే ప్రభు హస్తముతో
కాంతిలో నుండగా జయ కాంతులు -
జేసునే నే వెంబడింతును