Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నీపద సన్నిధి... ధన్యము
నీ శుభ నామమే శరణము ||2||
నీ సేవలోన.. నే సాగిపోనా
నీ పదమునే కోరనా ||నీ||
1. దుర్దినము రాకముందే
ఇపుడున్నవాటియందు ||2||
సంతోషమే లేదని వగచక ముందే
నీ సన్నిధి...ధన్యము
నా.. స్తుతి గీతికాధారము ||నీ||
2. నే దాగు చోటు నీవే
నా ముక్తి మార్గం నీవే
నా శక్తి నీ రక్తమే - నాప్రభుయేసు .
నీ వాక్యమే జీవము
నా... హృదయానికి మధురము ||నీ||