Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 4
నీ ప్రేమయే - మాకు శరణం ||2||
నీ పూజలే - మాకు అభయం ll 2 ll
రాజాధిరాజా - ఓ యేసునాధా ||2||
ఇలవేల్పు - వెలుగు ||2||
1 వ చరణం..
ఈ జీవితములో - నిను చేరనాకు
వరమిచ్చి - కరుణించుము ||2||
బహుదూరమైన - వాగ్ధాన సీమ ||2||
మాతోడు నీవై - నడిపించుము ||2|| llనీప్రేమయేll
2 వ చరణం..
నీ పాద సేవే - మా జీవితాశే
మా బ్రతుకే - ఫలియింపగా ||2||
మా జీవితంలో - లోటేమి కలదు ||2||
నీ జీవమెపుడు - మా కుండగా ||2|| llనీప్రేమయేll