Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నీ నీడలో నా బ్రతుకు గడవాలని
నీ అడుగుజాడలలో నే నడవాలని
హృదయవాంఛను కలిగియుంటిని
నీ సహాయము కోరుకుంటిని ||నీ||
1. నీయందు నిలిచి ఫలించాలని
ఈ లోక ఆశలు జయించాలని
నీ ప్రేమ నాలో చూపించాలని
నా పొరుగువారిని ప్రేమించాలని ||నీ||
2. నీ సేవలో నే తరించాలని
నీకై శ్రమలను భరించాలని
విశ్వాస పరుగు ముగించాలని
జీవకిరీటము ధరించాలని ||నీ||
3 నీ రూపు నాలో కనిపించాలని
నా అహమంతా నశియించాలని
నీ వార్త ఇలలో ప్రకటించాలని
నీ కడకు ఆత్మల నడిపించాలని ||నీ||