Lyrics: Fr. Johnson Chettur
Tune: Most Rev. Bishop Poola Anthony
Music: Thyagarajan
Album: స్వరాభిషేకం
నేపాపిని ప్రభో ప్రభో ప్రభో ||2||
కరుణించుమో విభో
కరుణామయుడవు నీవే ||2||
దయగల దేవుడవు నీవే
నన్ను మన్నించుమోదేవా
నీ దయ కురిపించుము ప్రభువా
దయ కురిపించుము దేవా ||నే||
1. తీగ తెగిన బ్రతుకు వీణను
సవరించుము శృతిచేయుము
నవరాగ సుధలను పలికించుము
సౌలును పౌలుగ మార్చిన దేవా
నా దోషం బాపగ రావా
నా ఎదలో నిలుపుము దేవా ||2|| ||దే||
2. పుట్టుకతోనే పాపాత్ముడను నీదరి నేను
ఇసుక రేణువును కదలని
భక్తితో నిను కొలిచేను ||2||
నీ సన్నిధిలో నిత్యం నిలువగా
సాయం చేయగ రావా
నీ కరుణ చూపుము దేవా ||2||