Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: జీవనాత్మ
ప నే పిలిచిన పిలుపును ఆలించి నీవు
పరుగున వచ్చిన ఓ ప్రియతనయ
మోదముతో సంతోషముతో నిన్నెన్నుకున్నాను
ఈ శుభవేళ ఈ శుభవేళ ||2||
1. హస్తముచాచి అభయమునిచ్చితిని
నా ఆత్మతో నిన్ను అభిషేకించితిని
విజయుడవై సాగుము నీవు
నాప్రేమను ఇలలో ప్రకటించు ||2|| ||నే||
2. అలసిన మనసుకు ఓదార్పు నీవై
నలిగిన బ్రతుకులో జ్యోతిని నింపు. ||2||
నా సేవకు నీవే అంకితమై
నా కీర్తిని ఇలలో వ్యాపింపు ||2|| ||నే||