Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నేనె జీవాహారం - నేనె నిత్యజీవం ....
నేనె పరమాహారం - నేనె నిజ పరిహారం ....
అని పల్కెను మన-ప్రభు యేసు
(మన) అందరికోసం ||2||
ఆ...ఆ...
1 వ చరణం..
జీవిత దేవుని - పుత్రుని దేహం
జీవము నిచ్చెడి - భోజ్యము మనకు ||2||
జీవిత ప్రభువుని - జీవపు రక్తం
జీవము పోసెడి - పానము మనకు ||2||
2 వ చరణం..
ఆత్మాంధకారము - పారగ ద్రోలనే
ఆత్మను పంపెడి - రాజాధిరాజు
దివ్య సత్ప్రసాదాన - దీవెనలివ్వన్
రొట్టె రసరూపాన - దాగొనియుండెన్llనేనెll
3 వ చరణం..
అలుపును సలుపును - అంతయు వదలి
అండకు రమ్మనెను - అందరి ప్రభువు ||2||
ప్రభు భోజ్యమెంతేను - పంచుకోరండి
పాత్రంబు నెంతేను - త్రాగను రండి ||2|| llనేనెll
4 వ చరణం..
అర్హత లేకుండా - యుండకు నీవు
ఆత్మను యెంతైన - అదుపులోనుంచు ||2||
ఆత్మలనేలేటి ఆత్మకు - లోనవు
ఎంతగానో నీ కెల్ల - అర్హత నిచ్చున్ ||2|| llనేనెll