Type Here to Get Search Results !

నీలో నీలో నేనుండాలనీ ( nilo nilo nenu dalani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీలో నీలో నేనుండాలనీ.. 

నీతోనే ఈ పయనం సాగాలనీ.. 

నా మనసే కోవెలగా మలచుకొంటిని

నా స్వామిగా నీ మూర్తినీ నిలుపుకొంటిని ||నీలో నీలో|| 


1. కొడిగట్టిన ఈ బ్రతుకు ప్రభాతమై మెరవాలని

అడుగంటిన ఈ జీవం సజీవమై సాగాలని 

వసివాడిన ఈ యెదలో వసంతమై మెరిసావు ||2||

అమరలోక విందుతో అమృతమై కురిసావు ||2||

||నీలో నీలో|| 


2. నీ పలుకు ధారలతో నిండిన ఈ హృదిని

నీ పూజకు నియమించి పూవులతో వికసించనీ 

నీ ప్రేమ మధురిమలో పులకించిన ఈ ప్రాణం 

ని ప్రేమ గానంతో రాగాలు రవళించనీ 

ని రాకకై ఎదురుచూచు నాలో ప్రతి అణువణువూ 

స్వామివి నీవేనని నీకోసం పరితపించనీ

||నీలో నీలో|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section