Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నేనే మార్గము సత్యము జీవమని
సజీవ జలవర ప్రధాతని భువిలో
వెలసిన ఓ ప్రభూ యేసు ప్రభో
ఈ భువిలో వెలసిన ఓ ప్రభో యేసు ప్రభో
అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ ||2|| llనేనేll
1 వ చరణం..
హృదయ శుద్ధిగలవారే దేవుని చూచెదరని
హృదయ వాకిటను నిలచి పిలచే ప్రేమామయి
నీ పిలుపును విని నిన్నే కనుగొని మనసే
నీ కర్పణ చేసెద ప్రభో llనేనుll
2 వ చరణం..
శత్రువే నీ మిత్రుడని ప్రేమతో దీవించమని
శాంతి దూతయై నిలచి పలికే కరుణామయి
నీ స్వరమును విని నిన్నే శరణని మహిమలో
నే నిన్నే కొలిచెద ప్రభో llనేనుll