Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: నేనే నిన్ను సృష్టించిన దైవం -
నేనే నిన్ను రక్షించిన దైవం
నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం
నిన్ను నడిపించు దైవం భయపడకు బంగారు బిడ్డ
నేను నీ దేవుడెగా ఏడవకు నా కంటి పాప నీతో నేనున్నానుగా
1. నేనే నిన్ను ప్రేమించే దైవం నేనే నిన్ను పాలించే దైవం
నేనే నీ గాయాలు స్వస్థపరచు జీవదాయక దైవం ||భయ||
2. నేనే నిన్ను లాలించే దైవం నేనే నిన్ను శిక్షించే దైవం
నేనే నీ కన్నీరు తుడిచేసి నిన్ను - కలకాలం ఓదార్చు దైవం ||భయ||