Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నేను అంటే నీకు ఎందుకో ఈ ప్రేమ
నన్ను మరచిపోవెందుకు . ||2||
నా ఊసే నీకు ఎందుకు ఓ ఏసయ్యా
నన్ను విడిచి పోవెందుకు
కష్టాలలో నష్టాలలో
వ్యాధులలో బాధలలో
కన్నీళ్లలోనే కడన వేదనలో.
. శోధనలో నా ప్రాణము అయినావు
నీవు ప్రాణమా నీ ప్రాణమా
నేనంటే నీకెందుకో
1. నిన్ను మరచిపోయినా
నన్ను మరచిపోలేవు .
నిన్ను విడిచివెళ్ళినా నన్ను
విడిచిపోలేవు ||2||
ఎందుకింత ప్రేమ నాపై ఏసయ్యా ||2||
ఏ ఋణమో యీ బంధము
నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను ||నే||
2. ప్రార్థించకపోయినా
పలకరిస్తూ ఉంటావు
మాట వినకపోయినా
కలవరిస్తూ ఉంటావు ||2||
ఎందుకింత ప్రేమ నాపై ఏసయ్యా ||2||
ఏ ఫలమో యీ బంధము
నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమ ||నే||