Lyrics: unknown
Tune: Fr. Vincent
Music: unknown
Album: సంగమం
ప. నేనును నా కుటుంబమును
ప్రభుని మాత్రమే సేవింతుము
మాకు ఏమి జరిగినను
ఎవరు యేమి పలికినను
ప్రభువే మాకు ఆధారం
ప్రభువే మాకు ఆనందం
హల్లెలూయా||4||
1. ఎఱ్ఱ సముద్రం ఆడ్డు వచ్చిన
మేము భయపడము
దేవుని హస్తం కాపాడును
ఎల్లపుడు జీవింతుము హల్లెలూయా ||4||
2. ఎరికో గోడల ముందుండిన
మేము భయపడము
దేవుని స్తుతించి ఆరాధింప
గోడలు కూలి పోవును హల్లెలూయా ||4||