Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: యేసుని చూడాలని
ప. నేను పిలిస్తే - పరుగున విచ్చేస్తాడూ
నేను స్తుతిస్తే - నా ప్రార్థనాలకిస్తాడు
నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తాడు
ఓ ఎంత గొప్ప ప్రేమ నాయేసుది ||నే||
1. నేను అలసిపోతే తన చేతిని
అందిస్తాడు అల కరుణతో
నన్ను నడిపిస్తాడు ||2||
శక్తినిస్తాడు నాకు సౌఖ్యమిస్తాడు
(ఓ) ఎంత గొప్ప ప్రేమ నా యేసుది||2|| ||నే||
2. నన్ను వెంబడించమని యేసు పిలిచాడు
తన వెలుగై నాకు మార్గమయ్యాడు ||2||
కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నాడు
ఓ ఎంత గొప్ప ప్రేమా నా యేసుది ||నే||