Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నేను పిలువగా పరుగున విచ్చేయును
నేను స్తుతించగా నా మొరనాలించును
నేను ఏడ్వగా లాలించి ఓదార్చును
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసయ్యది
ఓ ఎంత మంచి ప్రేమ నా యేసయ్యది.
1. నేను అలసినవేళ తనచేయినందిస్తారు
తన కరుణతో నన్ను నడిపిస్తారు,
శక్తినిస్తారు నాకు స్వస్థతనిస్తారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసయ్యది
ఓ ఎంత మంచి ప్రేమ నా యేసయ్యది
2. తనను వెంబడించమని యేసు పిలిచారు
తానే వెలుగై నాకు మార్గమయ్యారు
కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసయ్యది
ఓ ఎంత మంచి ప్రేమ నా యేసయ్యది
3. నేను ఒంటరినై యున్న సమయములో
నాకు చేరువై యేసు బలపరుచునుగా
ధైర్యము నిచ్చి నన్ను దృఢపరుచునుగా
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసయ్యది
ఓ ఎంత మంచి ప్రేమ నా యేసయ్యది