Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
నేస్తమా... నా దైవమా నిన్నే నే మరిచానని
కోపమా... ఆవేశమా నిన్నే నే వీడానని
కినుక చెందకుమా నాపై అలక పూనకుమా
కరుణమానకుమా నన్ను దూరముంచకుమా llనేస్తమాll
1 వ చరణం..
కనుల చీకటి క్రమ్మగా ఘమణ ఊబిలో పడితిని
నేను చెలిమిని మరచితీ దేహ సుఖములు కోరితి
జాలి చూపించు నా తప్పు సవరించు
నన్ను మన్నించు నీ ప్రేమ కురిపించు
నీవే శరణం ప్రియ ప్రభువా... llనేస్తమాll
2 వ చరణం.. కాపులేని వాడినై కఠిన శిలగ మారితి
ఎండమావులే నిజమని నమ్మి పరుగులు తీసితి
జాలి చూపించు నీ చెంత నను చేర్చు
కలత తొలగించు నన్ను మరలా బ్రతికించు
కరుణామయుడా ప్రియబాంధవా.... llనేస్తమాll