Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ దాగు స్ధలమే - గోధుమప్పం
నీమారు రూపం - గోధుమప్పం
దేవా అర్పణ - చేయగనుంటిన్
ప్రభువా అందుకో - గోదుమ రొట్టెన్ ||2|| llనీదాగుll
1 వ చరణం..
ఆ ద్రాక్షరసమే నీ రక్తమై - అద్భుత క్రియగా మారునని ||2||
పీఠం ముందు పెట్టితి దేవా - ఈ బీదకానుక చేకొనవా ||2||
2 వ చరణం..
అందాల సుగుణాల సిరితెచ్చితిన్ - అద్దాని మించిన కానుకలన్ ||2||
నా కలిమిగా తెచ్చితి దేవా - నవనీత కాన్కగ గైకొనవా ||2||