Type Here to Get Search Results !

నీ జీవితంలో గమ్యంబు ( ni jeevithamlo gamyambhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీ జీవితంలో గమ్యంబు ఏదో 

ఒకసారి యోచించివా

ఈనాడు నీవు ప్రభుయేసు కొరకు 

నీ హృదయ మర్పించవా


1 వ చరణం.. 

నీ తల్లి గర్భాన నీవుండినపుడు 

నిను చూచె ప్రభు కన్నులు ||2||

యోచించినావా ఏరీతి `నిన్ను 

నిర్మించె తన చేతులు llనీ జీవిll 


2 వ చరణం.. 

నీలోన తాను నివసింపగోరి 

దినమెల్ల చేజాచెను ||2||

హృదయంపు తలుపు తెరువంగలేవా

యేసు ప్రవేశింపను llనీ జీవిll 


3 వ చరణం.. 

తన చేతులందు రుధిరంపు ధారల్‌

భరియించె నీ కోసమే ||2||

భరియించే శిక్ష నీకోసమేగా 

ఒకసారి యోచించవా llనీ జీవిll 


4 వ చరణం.. 

ప్రభుయేసు నిన్ను సంధించునట్టి `

సమయంబు ఈనాడు కాదా ||2||

ఈచోట నుండి ప్రభుయేసులేక ` 

పోబోకుమో సోదరా llనీ జీవిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section