Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ మోము చూడ నా జీవితాశ -
నీ చెంత నుండ నా ఆశదేవ
నా ఆశ దీర్చి నను బ్రోచుదేవ -
కన్నీట కడిగి క్షమ నొసగు నాకు
1. నీ ఇంట చేర నా జీవితాశ -
ఇహ బంధములను తెగతెంచు దేవా
నా ప్రభువు నెపుడు విడనాడకుండ -
వెను వెంబడించ నా ఆశ దేవా
2. ప్రభు కీర్తనలను అంతులేకుండ -
గగనమై పాడ నా జీవితాశ
విజయంబు తోడ మోక్షంబుచేరి -
నీ ఇంట నుండ నా ఆశదేవా