Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా -
నే కట్టుబడి జీవింతును యేసయ్యా
అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయని పాడుచూ
నీ నీతి మార్గములో సాగెదనయ్యా-నీ నీతిలో నేను బ్రతికెదనయ్యా ||అల్లెలూయ||
1. నీ ప్రేమ బాటలో నడచుట కొరకు -
నీ ఆజ్ఞలే మాకు కొలమానము
నీ దివ్య చిత్తములో ఫలియించుటకు -
నీ సత్య బోధలే నాకాధారం ||అల్లెలూయ||
2. నీ కన్నుల కాంతిలో మనగలుగుటకు -
నీ రూపులో నేను పెరుగుట కొరకు
నీ వేద సత్యములే జీవపు వెలుగు -
నీ తత్వములోనే తరియింతునయా ||అల్లెలూయ||