Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప|| నీ కృపలో జీవించెద
నీ ప్రేమలో పవళించెద ||2||
నీ వాక్యంలో ఎదిగెదను
నీ సేవలోనే జీవించెద ||2||
హలేలూయా - హల్లేలూయా -
హల్లేలూయా ||2|| ||నీ కృపలో||
1. రాతి హృదయాలను
కదిలించును నీ వాక్యం
త్రోవతప్పు మనుజులను
ఖండించును నీ వాక్యం
తీయని నీ మాటను
నా నోట పలికించుము
కృంగిపోవు విశ్వాసమును బలపరచుము ||2||
హలేలూయా - హల్లేలూయా -
హల్లేలూయా ||2|| ||నీ కృపలో||
2. బీటలు బారిన నేలను తడుపును
ఆకాశవర్షం
ఫలియించని మనసులను
ఫలియింపజేయును నీ వాక్యం
అసాధ్యపు కార్యములను సుసాధ్యం
చేయును
నా జీవ నావను నడిపించి కృప చూపుము ||2||
హలేలూయా - హల్లేలూయా -
హల్లేలూయా ||2|| ||నీ కృపలో||