Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అబ్బా దైవమా
నీవే జీవమూ ఆశాదీపము
నీవే అభయము
నీ దివ్యరాజ్యం భువియందు రావాలి
నీ చిత్తం భువియంత జరగాలి
దివి భువి పాడాలి నీ దివ్య గీతం
భువియందు స్వర్గరాజ్యం రావాలి
అనుదిన దివ్యాహారం
ప్రతిరోజు మాకివ్వండి
తండ్రియైన దైవమా
1. స్వర్గరాజ్య సియోను
దేవదూతలతోనూ కీర్తించు...ప్రభుని
భువియందు మానవులతో అల్లెలూయా
గీతంతో పూజింతు... ప్రభుని ||2|| ||నీ||
2. భారం మోసే వారికి అలసిసొలసిన
వారికి అభయం నీవేగా ||2||
నిరీక్షించే వారికి నిత్యరక్షణ ఒసగు
ప్రభువు నీవేగా ||నీ||