Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: పరిశుద్దాత్మ సన్నిధి - 4
ప. నీ కృప ఆకాశము కంటే ఎతైనది
నీ ప్రేమ సాగరము కంటే లోతైనది
నీ కృప నా పైన నిలిపితివి
నీ ప్రేమ నాలోన నింపితివి ||2||
స్తోత్రము ||2|| నీకే స్తుతి స్తోత్రము నీకే ||2|| ||నీ||
1. పాపులపైన పుణ్యులపైన నీ ప్రేమ వర్షమును
నీ కాంతి కిరణమును
ఏకరీతిగ కురిపించుచున్న నిజమైన దేవుడవు
బహుబలమైన దేవుడవు
నీకంటే సజ్జనులు ఇలలోనే లేరు
నీకంటే అధికులు నా తోడే రారు ||2|| సోత్ర||నీ||
2. ధనికులైన దరిధ్రులైన నీ జీవ వాక్యమును
నీ ప్రేమ మార్గమును... ||2||
ఏకరీతిగ బోధించుచున్న శాంతి దాముడవు
బహు సహన శీలుడవు
నీకంటే జ్ఞానులు ఇలలోనే లేరు
నీకంటే అధికులు నా తోడే రారు ||2|| సోత్ర||నీ||