Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నీ మాట సంపూర్ణ స్వస్థత కలది
అది నీ సేవకునికి ప్రియమైనది
నీ బాట సంపూర్ణ స్వచ్ఛత కలది.....
అది నీ ప్రియునికి ప్రాణమైనది
నోరార నీమాటను పలుకనీ యేసయ్యా..
మనసార నీబాటను నడవనీ యేసయ్య ||నీ||
1. నీ చేయిచాపుమని నీవు పలుకగా
ఊచచేయిగలవాడు బాగుపడెనుగా ||2||
నీ పరుపును ఎత్తుకుని నీవు నడువమనగా
బలహీనుడు బలమొంది లేచినడిచేగా ||నీ||
2. అమ్మా నీబలహీనత విడిచిపోయెననగా...
నడుము వంగిపోయిన స్త్రీ లేచి నిలిచెగా ||2||
లాజరు బయటకు రమ్మని నీవు పలుకగా...
మృతుడైన వాడు బ్రతికి బయటికొచ్చెగా ||నీ||