Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ప్రకటింతును
నీ మాటకు బలమున్నది యేసయ్యా
యేసయ్యా బలమున్నది
1. గలిలయ సంద్రమందు పయనంబున
ఒకనాడు తుఫాను చెలరేగెనే ||2||
ఒకే మాటతో గద్దించగా ||2||
గాలియు అలలు శాంతించెను ||2|| ||నీ||
2. మరణించిన ఒక చిన్నారితో
తలితాకుమి అని అన్నావుగా |2||
నీ స్వరము ఆ చెవిని సోకంగనే ||2||
చిన్నారి లేచి కూర్చుండెను ||2|| ||నీ||
3. ఎఫెతా అన్నావు ప్రేమతో
మూగ చెవిటితో ఒకనాడు
నీ మాటలో ఏమున్నదో ||2||
ఆశ్చర్యముగా తను మాట్లాడెను ||2|| ||నీ||