Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
నీ రెక్కల దాపున నివసింతును నా ప్రభువా
వేల వేల శత్రువులను వెరువను నీ వుండగా ||2||
1.వేటగాని ఉరులు ఘోరమైన వ్యాధులు
బాధపెట్టు శత్రువు భారమైన బ్రతుకు ||2||
వేరు చేయలేవు వేధన లెన్నైనా ||2||
నీవే నా ఆశ్రయము నీవే నా దుర్గము ||2|| llనీ రెక్కll
2.కారుమోయుదారులు కరుకురాతి బాటలు
దారికాచు శత్రువు దరిచేరు మృత్యువు ||2||
నన్ను తాకలేవు నాకాపరి నీవు ||2||
నీ చూపేడాలుగా ` నీ మాటే ఖడ్గముగా ||2|| llనీ రెక్కll