Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ మోము చూడ - నా జీవితాశ
నీ చెంతనుండ – నా ఆశ దేవ ||2||
నా ఆశ దీర్చి నను బ్రోచు దేవ ||2||
కన్నీట కడిగి – క్షమ నొసగు నాకు ||2||
1:-
నీ యింట చేర – నా జీవితాశ
ఇహ బంధములను – తెగత్రెంచు దేవా
నా ప్రభువు నెపుడు – విడ నాడకుండ
నిను వెంబడించ – నా ఆశ దేవా ||2||
2:-
ప్రభు కీర్తనలను – అంతు లేకుండ
గగనమై పాడ నా జీవితాశ
విజయంబు తోడ – మోక్షంబుచేరి ||2||
నీ యింట నుండ నా ఆశ దేవా
3:-
నడి ప్రొద్దు వెలుగు – మించు నీ మోము
యెడ తెగక చూడ – నా జీవితాశ
నా ఆశ తీర నీ మోము జూడ
నా జీవితమును – నడిపించు దేవా ||2||