Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ సేవకై నీ ప్రేమకై - నా జీవితం నీకంకితం
నీ వెలుగులో నీబాటలో - నడిపించుము నా జీవితం
ఓ యేసయ్య నీవే నీవే - నా మార్గము
ఓ యేసయ్య నీవే నీవే - నా గమ్యము
1 వ చరణం..
నవజ్యోతివై నీవు - ఇలవెలసినావు నవ మార్గమేనాకు - చూపించినావు ||2||
విశ్వాసినై నీశాక్షినై - జీవింపగ నన్ను దీవించుము ||2|| ||ఓ యే||
2 వ చరణం..
నరజాతికోసం - మరణించినావు నవ వేదమై ఇలను - రక్షించినావు ||2||
నీ త్యాగమే నా జీవమై-జీవింపగ నన్ను దీవించుము ||2|| ||ఓ యే||