Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ నామము నా-మధుర సంగీతము
నీ వాక్యము నా జీవన వేదము ||2||
హల్లేలూయా..హల్లేలూయా.. ||4||
హల్లేలూయా.. హల్లేలూయా..హల్లేలూయా.. ||2||
1. దీనాత్ములు ధన్యులు
దేవుని రాజ్యము వారిది
శోకార్తులు ధన్యులు
ఓదార్పు వారు పొందెదరు ||2||
కాలాలు మారినా సూర్యచంద్రులే ఆగినా ||2||
మారదు నీ జీవ వాక్యం
మారదు నీ ప్రేమ వాక్యం ||2|| || ||హల్లే||
2 నిర్మల హృదయులు ధన్యులు
దేవుని వారు దర్శింతురు
దయామయులు ధన్యులు
దయను వారు పొందెదరు ||2||