Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ నామమే ఉదయ గానం `
నీ వాక్యమే హృదయ ధ్యానం
ఓ యేసు క్రీస్తు నీ స్మరణలోనే
నా బ్రతుకు కడతేరనీ..... పరలోకమును చేరనీ llనీll
1 వ చరణం..
బ్రతుకు బాటలో వెతుకులాటలో -
అతుకు జతుకు చితికిన బ్రతుకులో ||2||
శాతాను సంకెళ్ళలో ` పాపాల శృతి జ్వాలలో
శోధన, రోదన,ఆవేదనలు
యీ బ్రతుకు యిక మోయలేను llనీll
2 వ చరణం..
కల్వరి గిరిలో శ్రమలు సహించి
శిలువలో నీవే రక్తము చిందించి
సాతానునే సంహరించి ` పాపాలనే పరిహరించి
మోక్ష మార్గము చూపిన దేవా
రక్షణ భాగ్యము నీవే ప్రభువా llనీll