Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నీ నీతిలో నేను నిలవాలని
నీప్రేమలో నేను ఎదగాలని
ఆశించాను ఆత్మ స్వరూప
కరుణించవా కలుషాపహరణ ||2||
1. మరణాంధకారములో నివసించిన నన్ను||2||
నీ ప్రేమ హస్తముతో బ్రతికించినావు
నీ ద్రాక్ష తోటలో ద్రాక్షవల్లిగా ఫలియింప
చేయుమా జీవాత్మ ఫలమా' ||2|| ||నీ||
2. సాతాను శోధనలో విడిపించినావు
సంపూర్ణ స్వస్థతను దయచేసినావు
ఎనలేని నీ ప్రేమకేమియ్యగలను
ప్రతిచోట సాక్షిగా చాటెద ప్రభువా ||2|| ||నీ||