Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ పాద సేవలో.... నిరతము పయనింతును...
నీ ప్రేమ బాటనే... నిత్యము ప్రకటింతును.... ||2||
యేసయ్యా నిను అనుసరించెను
మెస్సయ్యా నిను వెంబడిరచెదను ||2|| llనీ పాదll
1 వ చరణం..
ఉన్నత శిఖరమున నను నిలుపువాడవు
ఉపదేశించుట నాకు నేర్పువాడవు ||2||
ఉత్సాహ ఆత్మతో నను నింపువాడవు
ప్రోత్సాహమొసగి నడిపించువాడవు ||2|| llయేసయ్యll
2 వ చరణం..
సమృద్ధి జీవమును నాకిచ్చువాడవు
సత్యము నిత్యము బోధించువాడవు ||2||
మేలైన మార్గములో నను నడుపువాడవు
కరుణామృతమును కురిపించువాడవు ||2|| llయేసయ్యll