Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ పూజకు పువ్వును నేనై
అర్పణగా వచ్చితి దేవా
నైవేద్యపు ప్రమిదను నేనై
కానుకగా తెచ్చితి దేవా ||2||
దీనతతో అర్పింతు
మనసారా సమర్పింతు
రాజాధిరాజా స్వీకరించు||2|| ||నీపూజ||
1. ఆబేలుని వలె అర్పణతో
అబ్రహాముని యాగముతో ||2||
మెల్కిసేదేకుని కృతజ్ఞత బలితో
ఇశ్రాయేలుల ప్రార్థనతో -
దేవా నీకే సమర్పింతును ||నీపూజ||
2. యేసుని రక్షణ యజ్ఞంతో -
మరియ కుమారుని అర్పణతో ||2||
శ్రీసభ అర్పించు
అనుదిన బలితో
క్రైస్తవ జనముల అర్చనతో
దేవా నీకే సమర్పింతును ||నీపూజ||