Type Here to Get Search Results !

నీ ప్రేమ తోటలో విరిసింది ( ni prema thotalo virisindhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీ ప్రేమ తోటలో విరిసింది 

ఈ పూజకుసుమం 

నీ పూజ పీఠం నీ సన్నిధానం 

అలరించ అర్పింతు దేవా 

నీ కోసమే నా జీవితం ||2|| 

ప్రియమార అర్పింతును

నేను ప్రియమార అర్పింతును ||నీ ప్రేమ|| 


1. ఎనలేని నీ దివ్యప్రేమ

అలరించె ఈ చిన్ని హృదయం 

ఏ రంగు రూపంబులేని 

పుష్పాన్ని ఎంచావు దేవా ||2|| 

అనురాగ రాగాలు అందించినావు 

అభిషేక వరములు కురిపించినావు ||2|| 

మమతానురాగాలతో

నను నేను అర్పింతును ||2|| ||నీ ప్రేమ|| 


2. నీ స్నేహ మాధుర్యమందే 

ఆనందమొందితి దేవా 

నీ పాద పద్మాల చెంత 

నివసింప నిలిచాను నిరతం ||2|| 

నీ ఆలయంలో నే దివ్వెనై 

నీ దివ్యబలిలో నే పువ్వునై ||2||

బ్రతుకంత నీ కోసమే 

మనసార అర్పింతును ||2|| ||నీ ప్రేమ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section