Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ ప్రేమ పూజారినయ్యా - నీతోనే నా లోకమయ్యా
నా ఏలికా నా పాలకా ||2|| -
నా ప్రభువా యేసయ్యా ||2||
1. దోసిట అనురాగ పూలతో -
నీ వాకిట నిలబడి ఉన్నానయ్యా ||2||
పిలిచిన పలికే నేస్తం నీవని -
ఆశగా నిన్నే పిలిచేనయా
నన్నర్పణ సేయగా నిలిచానయా
2. నీ మాటే నాకు చాలునయా -
ఈ బ్రతుకే ఇలలో ధన్యమయా ||2||
నీ ఆనతి కోసమే ఈ నిరీక్షణ -
నేనే నీకు సొంతమయా
నీ ఎదలో నన్ను దాచుమయా