Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ సిలువే నా ముక్తికి మార్గము
నీ సిలువే నా మోక్షద్వారము
నీ సిలువే నా శక్తికి సాక్ష్యము
నీ సిలువే నా రక్షణ భాష్యము
1 వ చరణం..
నే వదిలేసినా నే త్రోసివేసినా
నా పాప భారాన్ని విదిలించినా
నీ మాటవినక నీ వెంట రాక
నా దారి నాదని నిన్నొదిలినా
నన్నాదరించి పాపాన్ని మోసి
నే కాదన్నా నా వెంట నడచి
నను ప్రేమించి క్షమియించి
నిత్యజీవాన్ని నాకందించిన
2 వ చరణం.
నీ పై మోపిన నిను అంటగొట్టిన
నీ రక్తముతో తడిసిపోయిన
నీరసించిన నీ కాలుచేతులా
చీలలు కూడా బావురుమన్నా
నీలాకాశం నిప్పులు వెదజల్లిన
నిశీధి కూడా మౌనందాల్చిన నీ నీడనన్నాధరించి
నిశ్శబ్ధంగా ప్రేమగా తాకిన నీ సిలువే