Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ వాక్యమే నన్ను బ్రతికించెను...
బాధలలో నెమ్మది నిచ్చెను
కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా...
వాక్యమైయున్న యేసు వందనమయ్యా ||2||
1. జిగట గల ఊబి నుండి లేవనెతెను...
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను
నా పాదములకు దీపమాయెను...
సత్యమైన మార్గములో నడుపుచుండును ||నీ||
2. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగకవచమై
యుద్ధమునకు సిద్ధమనస్సు నిచ్చుచున్నది
అపవాది వేయుచున్న అగ్నిబాణములను
ఖడ్గమువలె అడ్డుకొని ఆపివేయుచున్నది ||నీ||
3. పాలవంటిది జుంటే తేనెవంటిది
నా జిహ్వకు మహా మధురమైనది
మేలిమి బంగారు కన్న మిన్నయైనది
రత్నరాశులకన్న కోరదగినది" ||2||