Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 7
నీ వాక్యము నా జీవము - నా త్రోవకు జ్యోతిర్మయి ఆలకించెదం లల...
ఆదరించెదం లల... ఆలకించి ఆదరించి ఆచరించెదం (2) ||నీవాక్యం||
1 జల ప్రళయములో - నోవాకు బోధించితివి
పాపుల నుండి వైదొలగమని - మార్గము చూపితివి (2)
నీ వాక్యము ఆలకించిన (2)
కుటుంబమంతా రక్షణ పొందెను నీ కారుణ్యములో ||నీవాక్యం||
2. కాపరిలేని మందను చూచి - జాలి నొందితివి ప్రేమతో
వారికి - రాజ్యము గూర్చి బోధించితివి (2)
నీవాక్యము ఆలకించిన (2)
మమ్మందరిని నీ దీవెనలతో నింపుము యేసయ్యా - ||నీవాక్యం||