Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ వాక్యము నా పాదములకు దీపం
నా త్రోవకు వెలుగై నన్ను నడిపించును ||2||
జుంటి తేనె ధారలకన్నా తీయనైనది
రెండంచుల ఖడ్గం కన్నా పదునైనది ||2||
నీ వాక్యము-ప్రభు నీ వాక్యము ||2||
1. పగలు మేఘసంభమై రేయి అగ్నిస్థంభమై
ఎడారిలో ఇజ్రాయేలులను నడిపించినదీ
నీ వాక్యము ప్రభు నీ వాక్యము ||2||
మరణించిన లాజరును జీవముతో లేపినదీ ||2||
సమరయ స్త్రీకి జీవజలమునిచ్చినదీ ||2||
నీ వాక్యము-ప్రభు నీ వాక్యము ||2||
||నీ వాక్యము||
2. నీటిని ద్రాక్షా రసముగ మార్చినదీ
ఐదువేల మందికీ ఆహారము నిచ్చినది
నీ వాక్యము ప్రభు నీ వాక్యము ||2||
పీడితులందరికీ విడుదలనిచ్చినది ||2||
కృంగియున్నవారికి ఓదార్పు ఒసగినది ||2||
నీ వాక్యము - ప్రభు నీ వాక్యము ||2||
||నీ వాక్యము||