Lyrics: unknown
Tune: Fr. DAvid Raju N
Music: Naveen M
Album: నీపద సేవలో - 1
ప. నీదు రాక మాకుచాలిక ఇక
లోటు లేదు విమోచకా ||2||
దిగిరావా మము బ్రోవ ఓ జీవదాయక ||2||
1. ప్రవచనాలు చాల తమ పేరు చాటగా
తరతరాలు నీదురాక ఎదురుచూడగా||2||
శాంతిదాతగా నిత్య తండ్రిగా ||2||
యుగయుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా ||2|| ||ది ||
2. పేదలకు సువార్త ప్రకటించు దూతగా
బంధితులకు పూర్ణ స్వేచ్చ ప్రసాదించగా
ఆత్మవశునిగా అభిషిక్తునిగా
మరణఛాయలోని వారి కాంతి రేఖగా ||2|| ||ది ||