Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిదురపోక ప్రార్థింప వరం నీయుమా
మేల్కొని ప్రార్థించు వరం నీయుమా
నిదురిస్తే విరోధి కలుపు జల్లును
జపం మరచినా విరోధి జయమొందును
1. హన్నావోలె కన్నీరు కార్చాలి
సామువేలు చూచు వరకు వేచియుండి ప్రార్థిద్దాం
2. దానియేలు వోలె స్తుతించి ప్రార్థించాలి
సింహాల నోళ్ళను ప్రతిదినం కట్టివేయాలి
3. పౌలు వోలె చెరలో ప్రార్థించాలి
తలుపులు తెరువబడి సంకెళ్ళు తెగాలి ||నిదు||