Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిజమేనా నా కల తీరేనా -
నేనే దూతనట దూత నోటి వార్తనట
అవునా... అవునా... ఓ...ఓ...ఓ.... ఓ...ఓ...ఓ.... ||నిజమేనా||
1. మెరిసిన చుక్కనట నే కులికిన పాకనట -
మళ్ళిన పశువునట పండిన తొట్టెనటా
వెదకిన జ్ఞానిని నడిచిన దారిని
మొక్కిన గొల్లలటా నే మోసిన గొర్రెనటా ||నిజమేనా||
2. పరిచిన పరకనట - నే ఒదిగిన పడకనట
నీ బోసి నవ్వునట -
నువ్వు పలికిన మాటనటి||2||
నేనే బోళము - నేనే స్వర్ణము -
నేనే ధూపమట - నీ పాద ధూళినట||2|| ||నిజమేనా||
3. విసిరిన గాలినట నే విరిసన మొగ్గనట -
మురిసిన మాతనట నే గెంతిన పాపనట||2||
మోసిన మాకును - నాటిని మేకును -
విరిగిన రొట్టెనట - నే నలిగిన ద్రాక్షనట||2|| ||నిజమేనా||