Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిత్య కన్యక పుత్ర నిర్మల సుచరిత
సత్యవేద చరిత సద్గుణ రూపా
సత్యముగా నీకు స్తవమును జేసెద సాధు జనావన
సర్వజన రక్షకా మంగళం – భవంతుతే మంగళం-మంగళం
రక్షక నీకు మంగళం-మంగళం
పావన కర్త, మంగళం-మంగళం llభవ ll
1:-
పరమ పావన వృత్తి నరులను బ్రోవనీ
ధర మరియమ్మకు వరసుతుడవై
స్థిరమతిని సేవ జేసెడి వారికి
పరమ పదము నిచ్చు బాల సర్వేశా, మంగళం-మంగళం llభవ ll
2:-
ఆదాము సంతతి – మీద కనికరమున
వేద సమస్తార్ధ బోధకుండవయి
బాధలెల్ల మాన్పి కరుణించినట్టి మీ
మీద భక్తి నిమ్ము మేటి సర్వేశా మంగళం-మంగళం llభవ ll
3:-
శరణు జొచ్చిన వారి కరుదుగ పుడమిని
వరము నిచ్చిన యట్టి గురురత్నమా
పరమ పావన పాపభారము నెడబాపి
కరుణను నుంచుము ఘన చరితా మంగళం-మంగళం llభవ ll
4:-
అ కలంక మతి వేద కనికర మీ జనులకు
ప్రకటితముగ దెల్పి పాపము బాపి
సకలార్ధమునెల్ల సంకల్పించుచు మాదు
వికల బద్దులు బాపు విఖ్యాత చరిత మంగళం-మంగళం llభవ ll