Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: స్పందన
ఆ......ఆ.....ఆ......ఆ.....
ప. నీలాల నింగిలో ప్రభవించు దీపమై
నీరాజనమిదియే అమలోద్బవి మాత ||2||
నీ త్యాగ జీవితం మధురాతి మధురం
నీ నిష్కళంకము ప్రియ తండ్రి వరము ||2||
1. ఆదాము శాపము తొలగింపగా
పరలోక తండ్రికి ప్రియదాసివైతివి ||2||
నీ గర్భ ఫలముగా ధరియించినావు
లోకాలనేలేటి రాజాధిరాజును ||2||
(సాగ రీమ గాప దపనీద మాగపా)
ప్రభు యేసు జననం ఆనంద దాయకం ||2||
ధరయందు విరిసింది ప్రభుశాంతి కుసుమం ||2||
అవే.. అవే...అవే మరియు
ఆ.....ఆ.....ఆ....ఆ.. ||నీ||
2. సాతాను శిరమును పాదాల క్రింద
అణగార్చినావు సుగుణాల మరియ ||2||
మా పాప భారాన్నీ తొలగించు తల్లి
అనురాగ సుధలు కురిపించు జననీ ||2||
(సాగ రీమ గాప దపనీద మాగపా)
కమనీయం నీ ప్రేమ
ఇలలోన కురిసింది. ||2||
మా కోసం ప్రార్థించు
ప్రియ యేసు మాత ||2||
అవే.. అవే... అవే మరియ
ఆ.....ఆ.....ఆ....ఆ.. ||నీ||