Type Here to Get Search Results !

నీలాకాశం నుండి వానామంచు కురిసి ( nilakasham nundi vanamanchu kurisi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 5 


గానగరీస గాపగరిస రీగరిషాద పాదపరీస 

నీలాకాశం నుండి - వానా మంచు కురిసి 

భూమినంతటిని తడిపి - ఫలమిచ్చేట్టుగా

దేవుని నోట నుండి - ఏతెంచిన ఈ వాక్కు

మానవ హృదిలో నాటి - ఫలమిస్తుందిగా

రాళ్ళు ముళ్ళు నడిచే నేల - ఫలమిస్తుందిగా

ముప్పది అరువది నూరంతలుగా - ఫలమిస్తుందిగా

అల్లెలూయా... అల్లెలూయా... ఆనందమానందమే.


1. రాతి నేలను మంచి నేలగా - మార్చును ఈ వాక్కే

ముళ్ళ పొదలను మల్లె పొదలుగా - మార్చును ఈ వాక్కే 

రాతి హృదిని తీసివేసి - మాంసపు హృదిగా - మార్చును ఈ వాక్కే. 


2. దారి తప్పిన గొర్రెపిల్లను - వెదకును ఈ వాక్కే 

చిమ్మ చీకటిని దివ్య వెలుగుగా - మార్చును ఈ వాక్కే 

తన రుధిరమునే - పాప విముక్తికై 

ఈ భువియంతా - కార్చెను ఈ వాక్కే. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section