Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీలో ఉండాలి నీతో ఉండాలి ఏసయ్యా నా యేసయ్యా
నీలా మారాలి నీతో సాగాలి ఏసయ్యా నా యేసయ్యా
1. లాజరు కోసం కన్నీరు కార్చిన ఏసయ్యా
స్నేహం కోసం కష్టాలు ఓర్చెద నేనయ్యా
2. పాపుల కోసం ప్రాణము నిచ్చిన ఏసయ్యా
మేలును కోరి త్యాగము చేసెద నేనయ్యా
3. సిలువలో మాకై రక్తము చిందిన ఏసయ్యా
పరుల సేవలో ప్రేమతో సాగెద నేనయ్యా
4. లోకం కోసం ఆత్మీయ భోజ్యమైన ఏసయ్యా
సౌఖ్యము వదలి అర్పణ చేసెద నేనయ్యా